
633views
లక్నో: ఇక నుంచి జైళ్లలో మహా మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రాలు వినిపిస్తాయి. ఖైదీల మానసిక ప్రశాంతత కోసం ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయత్నం ఇది. జైళ్ళలో మహా మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం పఠించాలని జైళ్ళ శాఖ మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి ఆదేశించారు. యూపీలోని జైళ్ళలో మహామృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రాల పఠనం ప్రారంభమైందని అధికారులు కూడా వివరణ ఇచ్చారు.
Source: NationalistHub





