News

కెనడాలో భారతీయ విద్యార్థి కాల్చివేత!

556views

షెర్‌బోర్న్: కెనడాలోని షెర్‌బోర్న్ ప్రాంతంలో గురువారం కార్తీక్ వాసుదేవ్ అనే భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. సబ్ వే స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల కార్తీక్ వాసుదేవ్‌కు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అనంతరం అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఓ ఆగంతుకుడు తుపాకీతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. కార్తీక్ వాసుదేవ్ మార్కెటింగ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ చదివేందుకు జనవరిలో టొరొంటోకు వెళ్లాడు. సెనెకా కాలేజీలో అతడికి అడ్మిషన్ లభించింది. అతను ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి