
557views
న్యూఢిల్లీ: ముంబై మారణకాండ సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్(46) కూడా ఉగ్రవాదే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో ఉగ్రవాదుల నియామకం, నిధుల సేకరణ, ఉగ్ర దాడుల అమల్లో తల్హా చురుగ్గా పాల్గొన్నాడని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
అతడు పాకిస్థాన్‌లో లష్కరే తాయిబా ఉగ్ర సంస్థలను సందర్శిస్తున్నాడని, భారత్, ఇజ్రాయెల్, అమెరికా తదితర పాశ్చాత్యా దేశాలపై యుద్ధం చేయాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడని వెల్లడించింది.
Source: Nijamtoday





