News

ముంబై బాంబు పేలుళ్ళ‌ సూత్రధారి హఫీజ్ సయ్యద్‌కు 32 ఏళ్ళ జైలు శిక్ష‌

332views
  • అతని ఆస్తులు స్వాధీనం చేసుకోవాలంటూ పాక్ కోర్టు తీర్పు

న్యూఢిల్లీ: ముంబయి దాడుల సూత్రధారి, జమాత్ -ఉద్‌-దవా చీఫ్ హఫీజ్‌ సయీద్‌కు 32 ఏళ్ళ‌ జైలుశిక్ష పడింది. ఉగ్రవాదులకు నిధుల మళ్లింపునకు సంబంధించిన రెండు కేసుల్లో పాకిస్థాన్‌ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది. ఒక కేసులో 15.5 సంవత్సరాలు, మరో కేసులో 16.5 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

దీంతో పాటు రూ.3,40,000 జరిమానా విధించిన కోర్టు.. అతడికి చెందిన ఆస్తులు స్తంభింపజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. హఫీజ్‌ సయీద్‌ నిర్మించిన మసీదు, మదర్సాను పాక్‌ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. 2008లో జరిగిన ముంబయి ఉగ్ర దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన సూత్రధారి ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని కేంద్రం పలుమార్లు కోరినప్పటికీ పాక్‌ తిరస్కరిస్తూ వస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి