
లక్నో: పౌరాణిక కథల్లో కూడా అత్యాచారాల ఉదాహరణలు ఉన్నాయని అంటూ అత్యాచారానికి సంబంధించిన చారిత్రక దృక్కోణాలను క్లాసులో ప్రస్తావించినందుకు ఓ ప్రొఫెసర్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
బీజేపీ కార్యకర్త నిషిత్‌శర్మ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ(ఎఎంయు)లోని జెఎన్ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ జితేంద్రకుమార్‌పై ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ పురాణాల్లో దేవుళ్లు అత్యాచారానికి పాల్పడ్డరని క్లాసులో చెప్పడం ద్వారా ప్రొఫెసర్ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని నిషిత్‌శర్మ ఆరోపించారు. ఈ నెల అయిదోతేదీ మంగళవారం ఆయన ఎంబిబిఎస్ మూడో ఏడాది విద్యార్థులకు అత్యాచారాలపై పాఠ్యాంశాన్ని బోధిస్తూ ప్రొఫెసర్ పవర్‌ప్రాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అత్యాచారం పురాతన కాలం నుంచి ఉనికిలో ఉందని వివరిస్తూ రోమన్, గ్రీక్, భారత్‌లతో సహా ప్రపంచంలోని వివిధ మూలాల్లోని పురాణాల్లో గల అత్యాచార సంస్కృతికి సంబంధించిన పలు పౌరాణిక ఉదాహరణలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
Source: Nijamtoday





