News

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ : జేపీ నడ్డా

449views

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. రాజ్యసభలోనూ బీజేపీ 100 సీట్ల మార్క్ దాటిందన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కూడా లేడని గుర్తు చేశారు.

బీజేపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యకర్తలు రక్త దానం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని కరోల్‌ బాఘ్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ బీజేపీ పేదల పార్టీ అని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి