News

చెత్త వేశార‌ని ఇరుగుపొరుగు వారిపై దాడి!

414views

ఉత్తరప్రదేశ్: మీర్జాపూర్‌లో అబ్దుల్, అతని కుటుంబ సభ్యులు.. తమ ఇంటికి ద‌గ్గ‌ర్లో చెత్త వేస్తున్నార‌ని ఇరుగుపొరుగు వారిపై రాడ్లు, కర్రలతో దాడికి పాల్ప‌డ్డారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ షాకింగ్ సంఘటనలో, అబ్దుల్ అనే కోపోద్రిక్తుడైన వ్యక్తి.. తన ఇంటి వెలుపల చెత్తను ఉంచార‌నే ఆరోపణతో అదే ప్రాంతంలో నివసిస్తున్న తన పొరుగువారిపై విరుచుకుపడ్డాడు. ఈ చర్యను రికార్డ్ చేస్తున్న ఒక వ్యక్తిని కూడా అబ్దుల్ దారుణంగా కొట్టాడు. కేసు నమోదు చేశామని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని మీర్జాపూర్ పోలీసు అధికారి తన ట్వీట్‌లో తెలిపారు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి