News

పోలీసుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన కార్పొరేట‌ర్ గౌస్ అరెస్టు!

502views

భాగ్య‌న‌గ‌రం: పాత బ‌స్తీలో పోలీసుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఎంఐఎం కార్పొరేట‌ర్ గౌస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ముషీరాబాద్‌లో పోలీస్ విధులను అడ్డుకోవడమే కాకుండా, వారిపై దురుసుగా ప్రవర్తించారు. హైదరాబాద్‌ బోలక్‌పూర్‌లో పోలీసులతో కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్.. డీజీపీకి చేసిన ట్వీట్​పై పోలీసులు స్పందించారు. కేటీఆర్‌ సూచనతో గౌస్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు పోలీసులు. వైద్య పరీక్షలు కోసం గాంధీ హాస్పిటల్​కు తరలించారు.

రెండు రోజుల క్రితం అర్ధరాత్రి పూట.. బోలక్‌పూర్‌లో తెరిచి ఉంచిన దుకాణాలు మూసేయాలని దుకాణదారులకు పోలీసులు చెప్పారు. రంజాన్ సందర్భంగా తెరుచుకున్నామంటూ దుకాణాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కార్పొరేటర్ గౌసుద్దీన్.. పోలీసులపై దుర్భాషలాడారు. వాళ్ళ‌పైకి దూసుకెళ్లి దౌర్జన్యం చేశారు. దుకాణాలు మూసేదిలేదని వారితో వాగ్వాదానికి దిగాకు. ఈ వీడియోను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌‌గా మారింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి