News

ఇద్దరు తీవ్రవాదుల హ‌తం!

547views

జ‌మ్ము: పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అన్సార్ గజ్వతుల్ హింద్, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు తెలిపారు. హ‌తులు సఫత్ ముజఫర్ సోఫీ అలియాస్ మువావియా, ఉమర్ తేలీ అలియాస్ తల్హాగా గుర్తించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్‌లోని ఖోన్‌మో ప్రాంతంలో సర్పంచ్‌ను హత్య చేయడంతో పాటు పలు ఉగ్రదాడుల కేసుల్లో వీరిద్ద‌రి ప్రమేయం ఉంద‌ని పోలీసులు చెప్పారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి