News

ఎన్ఐఏకు గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు

574views

ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టనుంది. ఆలయం వద్ద పదునైన ఆయుధంతో దాడికి దిగిన వ్యక్తిని అహ్మద్ అబ్బాసిగా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం ఒక వ్యక్తి గోరఖ్‌నాథ్ ఆలయం ఆవరణలోకి బలవంతంగా ప్రవేశించి ”అల్లా హో అక్బర్” అంటూ కేకలు వేయడంతో పాటు, అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు.

ఆయుధం చూపిస్తూ వీరంగం చేశాడు. దీంతో పది నిమిషాల్లో భద్రతా సిబ్బంది అతన్ని చుట్టుపట్టి అదుపులోనికి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ గోరఖ్‌నాథ్ ఆలయం ప్రధాన పూజరిగా ఉన్నారు. ఈ ఆలయ ఆవరణలో ఆయన వ్యక్తిగత బసకు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. దాడి జరిగిన సమయంలో ఆలయంలో ముఖ్యమంత్రి లేరు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి