
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తల దృష్ట్యా భారత రక్షణ రంగం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్ఠం చేస్తూ ముందుకు వెళుతోంది. తాజాగా శత్రుదేశాలకు చెమటలు పట్టించే కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో కొనసాగుతున్న గొడవల మధ్య, భారతదేశం తన ఎల్‌సీఏ తేజస్ యుద్ధ విమానాల సామర్థ్యాలను మెరుగుపరచడానికి అమెరికన్ జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యూనిషన్ (జెడీఎఎం) ప్రెసిషన్-గైడెడ్ బాంబింగ్ కిట్‌ల కోసం ఆర్డర్లు చేసింది.
వైమానిక దళం డెలిగేటెడ్ ఫైనాన్షియల్ పవర్స్ కింద జెడీఎఎం కిట్‌లను కొనుగోలు చేయడం వల్ల తేజస్ జెట్‌లు 80 కి.మీ, అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువుల బంకర్‌లు, రన్‌వేలను ధ్వంసం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది మరింత ఖచ్చితత్వంతో బాలాకోట్ లాంటి వైమానిక దాడులను నిర్వహించేందుకు తేజస్ విమానాలకు సహాయపడతాయని ప్రభుత్వ ఉన్నత వర్గాలు మీడియాకి తెలిపాయి.
లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్ కోసం యుఎస్ నుండి జెడిఎఎం కోసం ఆర్డర్ ఇచ్చారు. శత్రు విమానాలను మరింత మెరుగైన మార్గంలో అడ్డుకోవడమే కాకుండా.. స్వదేశీ విమానాలకు మరింత శక్తిని ఇచ్చినట్టు అవుతుంది.
Source: NationalistHub





