News

ముస్లిం సమాజం మెజారిటీగా ఉంది.. ఇకపై మైనారిటీలుగా పరిగణించలేం

561views
  • అసొం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ

గౌహ‌తి: అసొం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ అనేక అసొం జిల్లాల్లో హిందువులు నిస్సహాయంగా తక్కువ సంఖ్యలో ఉన్నారని, వారిని మైనారిటీలుగా ప్రకటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముస్లిం సమాజం మెజారిటీగా ఉందని, ఇకపై రాష్ట్రంలో మైనారిటీగా పరిగణించలేమని హిమంత బిస్వా శర్మ రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించారు. కొన్ని జిల్లాల్లో హిందువులు 5,000 కంటే తక్కువ ఉండడంతో, హిందువులను మైనారిటీలుగా ప్రకటించవచ్చని హిమంత బిస్వా శర్మ అన్నారు.

సీఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, “రాష్ట్రంలో హిందువులు మెజారిటీగా లేనప్పుడు మీరు వారిని మైనారిటీలుగా ప్రకటించవచ్చు. జిల్లాలో హిందూ సమాజం మెజారిటీగా లేనప్పుడు.. ఆ జిల్లాలో హిందువులను కూడా మైనారిటీలుగా ప్రకటించాలని నేను భావిస్తున్నాను. అసొంలో హిందువులు మైనారిటీలుగా ఉన్న అనేక జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో 5,000 కంటే తక్కువ మంది హిందువులు కూడా ఉన్నారు.

ముస్లిం సమాజం మెజారిటీ కలిగి ఉన్న అతిపెద్ద సంఘం. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు.. గణాంకాలు కూడా సూచిస్తూ ఉన్నాయి” అని అన్నారు. అసొంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)ని సమీక్షించాలని సిఎం హిమంత బిస్వా శర్మ డిమాండ్ చేశారు. పాత ఎన్‌ఆర్‌సిని సమీక్షించాలని, మళ్లీ కొత్తగా సమీక్ష చేయాలని గతంలో కూడా చెప్పామని ఆయన అన్నారు. ఆల్ అసొం స్టూడెంట్స్ యూనియన్ (ఎఎఎస్‌యు)తో మా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మళ్ళీ ఎన్‌ఆర్‌సి అమలు చేయాలని మేము కోరుకుంటున్నామన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి