News

మీడియా ఐడీ కార్డుతో ఉన్న ఎల్‌ఈటీ ఉగ్రవాదుల హతం

494views

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్‌పీఎఫ్‌ దళాలు గాలింపు చేపట్టాయి.

ఈ సందర్భంగా గాలింపు బృందాలపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను హ‌త‌మ‌య్యార‌ని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. లష్కరే తొయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిద్దరు పౌరులను చంపిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.

ఎన్‌కౌంటర్‌లో హతమైన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదుల్లో ఒకరు మీడియాకు సంబంధించిన గుర్తింపు కార్డు (ఐడీ)ని కలిగి ఉన్నారు. ఇది మీడియా కార్డుల దుర్వినియోగానికి సంబంధించిన స్పష్టమైన ఉదాహరణగా సూచిస్తోందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐ.జి.పి) కాశ్మీర్ అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి