News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 28 జ‌వాన్ల‌కు అస్వ‌స్థ‌త‌!

385views

రాయ్‌పూర్‌: విషాహారం తిని 28 మంది జవాన్లు అస్వస్థత పాలైన ఘటన ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లా చింతగుప్పలో జరిగింది. జవాన్లందరూ సీఆర్‌పీఎఫ్ 150వ బెటాలియన్‌కు చెందినవారు. అస్వస్థతకు గురైన వారికి సీఆర్‌పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొందరు జవాన్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

పాత ఆవాల నూనెతో వండిన ఆహారం తినడం వల్లే జవాన్లు అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనపై కమాండెంట్ రాజేశ్‌ యాదవ్ విచారణకు ఆదేశించారు. భవిష్యత్​లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి