
627views
రాజమహేంద్రవరం: కళలకు నిలయమైన రాజమహేంద్రవరంలో జాతీయస్థాయిలో కళాకారులు సందడి చేయనున్నారు. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంస్కృతీ మహోత్సవం పేరుతో ఇవాళ, రేపు జాతీయ స్థాయి కళాకారులు సందడి చేయనున్నారు.
దేశం సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా సెట్టింగులు, ఆయా రాష్ట్రాల ప్రధాన కళా రూపాలు ప్రదర్శించేందుకు ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఈ మహోత్సవంలో వెయ్యి మంది జాతీయ స్థాయి కళాకారులు తమ ప్రదర్శనలతో సందడి చేయనున్నారు.
Source: EtvBharat





