449
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని విజయతీరాలకు చేర్చి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లఖ్నవూలోని అటల్ బిహారీ వాజ్పేయీ ఇకానా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ సహా హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకుర్.. పార్టీ సీనియర్లు, పారిశ్రామిక వేత్తల మధ్య యూపీకి వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు ఆదిత్యనాథ్. కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
Source: EtvBharat