
498views
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ హింసాకాండ కేసులో నిందితుడు ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) మాజీ విద్యార్థి నాయకుడు ఖలీద్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) సెక్షన్ల కింద సెప్టెంబర్ 13, 2020న అరెస్టు చేశారు. కర్కర్దూమా కోర్టు మార్చి మూడోతేదీన తీర్పును రిజర్వ్ చేసింది. మార్చి 14న ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఉమర్ ఖలీద్ తరఫు న్యాయవాది రాతపూర్వక వాదనలు దాఖలు చేయనందున వాయిదా పడింది.
అదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ బెయిల్ పిటిషన్‌ను గురువారం తోసిపుచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్‌పిపి) అమిత్ ప్రసాద్ మాట్లాడుతూ, కుట్ర కేసులో నిందితుల సంపూర్ణ ప్రవర్తనను చూడాల్సి ఉందని పేర్కొన్నారు.
Source: Organiser





