
-
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఉత్తరాఖండ్: మానస సరోవర్ వెళ్ళే భక్తులకు ఇక చైనా లేదా నేపాల్ మీదుగా వెళ్ళి ఇబ్బందులకు గురికావాల్సిన అవసరం లేదు. వీరు నేరుగా ఉత్తరాఖండ్ మీదుగా, అంతకన్నా తక్కువ దూరం ప్రయాణం చేసి వెళ్ళవచ్చు. ఈ మార్గం వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇకమీదట ఉత్తరాఖండ్‌లోని పితోర్గఢ్ నుంచి నేరుగా మానస సరోవర్‌కు వెళ్ళే మార్గాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన పార్లమెంట్‌లో ప్రకటించారు.
ఈ రహదారి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు. ఈ రోడ్డుతో సమయాన్ని తగ్గించడమే కాకుండా ప్రస్తుత ప్రమాదకరమైన ట్రెక్‌లా కాకుండా సాఫీగా ప్రయాణం చేయొచ్చని ఆయన తెలిపారు. తమ మంత్రిత్వ శాఖ జమ్మూ కాశ్మీర్‌లో రోడ్డు కనెక్టివిటీని పెంచుతోందని, ఇది శ్రీనగర్, ఢిల్లీ లేదా ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందని గడ్కరీ పార్లమెంటులో తెలిపారు.
Source: Nijamtoday





