
592views
-
ఉగ్ర దాడులకు అవకాశం ఉందని పోలీసులకు ఇన్‌పుట్స్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఇన్‌పుట్‌లు అందడంతో.. న్యూ ఢిల్లీలో హైసెక్యూరిటీ అలర్ట్ జారీ చేసినట్టు ఎ.ఎన్.ఐ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఎ-తాలిబాన్ (ఇండియా సెల్)కు చెందిన ఈ-మెయిల్‌ను కొంతమంది వ్యక్తులు అందుకున్నారు. ఆ వివరాలను యూపీ పోలీసులకు అందించారని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారి తెలిపారు.
ఈ మెయిల్‌కు సంబంధించిన వివరాలను యూపీ పోలీసులు ఢిల్లీ పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. పంపిన వ్యక్తిని ట్రాక్ చేయడానికి, అతను మెయిల్‌లో చెప్పిన వివరాలని ధ్రువీకరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇన్‌పుట్‌ల ఆధారంగా ఢిల్లీ పోలీసులు మంగళవారం న్యూఢిల్లీలోని రద్దీగా ఉండే సరోజిని నగర్ మార్కెట్‌లో సోదాలు నిర్వహించారు.
Source: NationalistHub





