News

ఆ మూడు రైతు చట్టాలు మంచివే…

558views
  • వీటికి 86 శాతం రైతు సంఘాల మద్దతుంది

  • సుప్రీం కోర్టు కమిటీ వెల్ల‌డి

న్యూఢిల్లీ: రైతుల ఆందోళన కారణంగా రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు 86 శాతం రైతు సంఘాల నుంచి మద్దతు ఉన్నట్టు సుప్రీంకోర్టు నియమిత కమిటీ తెలిపింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టలు తీవ్ర వివాదాస్పదమవడంతో మోదీ ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, రైతులకు మోదీ క్షమాపణలు తెలిపారు. ఉద్యయమాన్ని విరమించి రైతులను ఇంటికి వెళ్ళాల‌ని కోరారు.

ఈ వివాదాస్పద చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా 3 కోట్ల మంది రైతులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆందోళన నిర్వహించిన రైతుల సంఘాల్లో 86 శాతం ఈ చట్టాలకు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. వీటిని రద్దు చేయడం ద్వారా నిశ్శబ్దంగా ఉంటూ ఈ చట్టలకు మద్దతు తెలిపిన వారికి ‘అన్యాయం’ జరిగినట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి