News

హిజాబ్ అంటూ ప‌రీక్ష‌లు రాయ‌కుంటే, తిరిగి నిర్వ‌హించం

457views
  • తేల్చిచెప్పిన కర్ణాటక విద్యాశాఖ

బెంగ‌ళూరు: హిజాబ్ అంటూ కర్ణాటక సెకెండ్ పీయూసీ పరీక్షలు-2022కు హాజరు కాని విద్యార్థుల విషయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రీ యూనివర్శిటీ ఎడ్యుకేషన్(పీయూఈ) కీలక ప్రకటన చేసింది. తిరిగి పరీక్షలు నిర్వహించలేమని తెగేసి చెప్పింది. నిరసనలకు దిగిన విద్యార్థులు పీయూసీ-2 ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను బాయ్‌కాట్ చేసిన కారణంగా తిరిగి పరీక్షలు నిర్వహించరాదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

ఫిబ్ర‌వరి, మార్చిలో కర్ణాటక సెకెండ్ పీయూసీ ఎగ్జామ్స్-2020 షెడ్యూల్ ఉంది. అయితే, ఈ సమయంలో చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాయకూడదని నిర్ణయించుకున్నారు. హిజాబ్ ధరించడానికి అనుమతించని కారణంగా కొందరు, వీరికి మద్దతుగా మరికొందరు, ఒక తీర్మానం కోరుతూ ఇంకొందరు పరీక్షలకు దూరంగా ఉండిపోయారు. కర్ణాటక సెకెండ్ పీయూసీ పరీక్షల్లో (2022) పాస్ కాని వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్న తరుణంలోనే తాజా ప్రకటన వెలువడింది. ప్రాక్టికల్ పరీక్షలకు గైర్హాజరయ్యారనే కారణం చూపుతూ ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రభుత్వం తెరదించేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి