461
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అటవీ ప్రాంతం, సుక్మా జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పారామిలటరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కి చెందిన ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జాగర్‌కొండ పోలీస్ స్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీపీఆర్‌ఎఫ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్మగుండ క్యాంపు సమీపంలో కాల్పులు జరిగినట్టు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ తెలిపారు.
గాయపడిన జవాన్ల పరిస్థితి నిలకడగా ఉందని ఐజీ తెలిపారు. కాల్పుల అనంతరం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఫిబ్రవరిలో రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో పారామిలటరీ దళానికి చెందిన ఒక అధికారి మరణించగా, మరో సైనికుడు గాయపడ్డాడు.