
721views
-
పాఠ్యాంశంగా చేర్చనున్నట్టు వెల్లడించిన సర్కారు
బెంగళూరు: కర్ణాటక సర్కార్ కొత్త విద్యావిధానంపై కసరత్తు చేస్తోంది. పాఠ్యాంశాల్లో భగవద్గీతను తాము ప్రవేశపెట్టనున్నట్టు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీఎస్ నగేష్ ప్రకటించారు. నిపుణులు అంగీకారం తెలిపితే తప్పనిసరిగా విద్యార్థుల కోసం పాఠ్యాంశాలలో భగవద్గీతను చేరుస్తామని చెప్పారు. భగవద్గీత హిందువులకు మాత్రమే పరిమితం కాదని, అందరికీ ఉపయుక్తమని అన్నారు. అయితే, పాఠ్యాంశాల్లో భగవద్గీతను ఈ ఏడాది నుంచి కాకుండా వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెడతామని తెలిపారు.





