
-
కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కశ్మీర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఏదైతే జరిగిందో దానికి పాకిస్థాన్, ఇస్లాం తీవ్రవాదం కారణాలని అన్నారు. ఆ ప్రభావం హిందువులందరిపైన, కశ్మీర్ పండిట్లు, కశ్మీర్ ముస్లింలు, డోగ్రాలపైన పడిందని అన్నారు. జమ్మూలో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ అతిపెద్ద హిందూ సెక్యురలిస్టు అని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు.
తమ కాంగ్రెస్ పార్టీతో సహా రాజకీయ పార్టీలన్నీ కులం, మతం, ఇతర అంశాలతో విభజించాలని చూసినా సమాజం కలిసికట్టుగా నిలబడాలన్నారు. ”రాజకీయ పార్టీలు కులం, మతం పేరుతో నిరంతరం విభజించే ప్రయత్నించవచ్చు. మా(కాంగ్రెస్) పార్టీతో సహా ఏ పార్టీని నేను మినహాయించడం లేదు. సమాజం మాత్రం ఏకతాటిపై నిలవాలి. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా న్యాయం జరగాలి” అని ఆజాద్ అన్నారు.





