
521views
* ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు
హోళీని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే రంగులు జల్లుకుంటా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. పలు చోట్ల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హోళీ సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. రంగుల పండగ అందరి జీవితాల్లో ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, రాజ్ నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ మధురలో హోళీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు. గుజరాత్ లో చిన్నారులు, మహిళలు రంగల జల్లుకుని నృత్యాలు చేసి హోళీ పండగ చేసుకున్నారు. హోళీ సందర్భంగా హోళికా దహన కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.





