News

`ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను అభినందించిన ప్రధాని

510views

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా శుక్ర‌వారం విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంటున్న `ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సినిమాను చూసిన ఆయన చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు గు నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను అభినందించారు.

అప్పట్లో కశ్మీర్‌లో జరిగిన సంఘటనలను క‌ళ్ళ‌కు కట్టినట్టు చూపించారని ప్రధాని అభినందించినట్టు చిత్ర దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను ఆయన‌ ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. ధన్యవాదాలు మోదీజీ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ప్రేక్షకులతో పంచుకున్నారు డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి