News

క‌న్యాకుమారిలో పూజారిని నరికిన డీఎంకే కార్యకర్త!

593views

కన్యాకుమారి: కన్యాకుమారిలో ఆలయ పూజారిపై డీఎంకే కార్యకర్త దాడికి పాల్పడ్డాడు. నిందితునికి పోలీసులు సహాయం చేస్తున్నారని బాధిత కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. తీవ్ర గాయాల‌పాలైన‌ పూజారిని కుజితురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

పండ‌ర‌ప‌రంపు అనే ఊరుకు చెందిన శశిధరన్ అనే 70 ఏళ్ళ‌ మాజీ సైనికుడు. ఇత‌ను కన్యాకుమారిలోని పుదుక్కడై సమీపంలోని ఇసక్కియమ్మన్ ఆలయంలో అర్చక విధులు నిర్వహిస్తున్నాడు. ఈయ‌న‌కు బీజేపీ స‌భ్య‌త్వం కూడా ఉంద‌ని చెబుతున్నారు. ఈ నెల 10న, అర్జునన్ అనే బంధువు.. శ‌శిధ‌ర‌న్ ఆలయంలో ఉన్నప్పుడు కొడవలితో న‌రికాడు.

నిందితుడు అర్జున‌న్‌పై 50 కేసులు, క్రూరమైన హింసకు సంబంధించి దాదాపు 18 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అర్జున‌న్‌ను అరెస్టు చేసినప్పటికీ, కేసును త‌ప్పుతోవ ప‌ట్టించేందుకు రాజకీయ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంద‌ని బీజేపీ కార్యకర్తలు, హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితుడు శశిధరన్‌కు అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని ఆల్ ఇండియా ఎక్స్-సర్వీస్‌మెన్ ఫెడరేషన్ హామీ ఇచ్చింది. ఇదిలావుండ‌గా, నిందితుడు డీఎంకే సభ్యుడన్న విషయాన్ని తమిళ మీడియా పూర్తిగా దాచిపెట్టి బంధువుల మధ్య జరిగిన గొడవగా ప్రచారం చేసింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి