News

రాజాసింగ్‌పై కేసు కొట్టివేత

387views

భాగ్య‌న‌గ‌రం: బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌పైన వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌ పైన ఉన్న కేసులను దాచి పెట్టారని అప్పట్లో టీఆర్ఎస్ తరుఫున గోశామహాల్ నుంచి పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ కేసు వేశారు. 51 కేసులు ఉంటే అఫిడవిట్‌లో 47 కేసులే చూపెట్టారని ఫిర్యాదులో రాథోడ్ పేర్కొన్నారు. ఆ నాలుగు కేసులు తన దృష్టిలో లేవని రాజాసింగ్ న్యాయస్థానానికి వివరించారు. దీంతో హైకోర్టు కేసును కొట్టివేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి