News

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా!

382views

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి హవా స్పష్టంగా కనిపిస్తున్నది. పంజాబ్‌లో మాత్రం ఆప్ అధికారంలోకి రాబోతున్నది. కాంగ్రెస్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో 37 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలువబోతున్నది. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బిజెపి మెజారిటీ మార్క్ ను దాటింది. ప్రధాన ప్రతిపక్షం సమాజవాద్ పార్టీ వెనుకబడి ఉంది. ఉత్తరాఖండ్, మణిపూర్ లలో కూడా బిజెపి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నది. గోవాలో మాత్రం అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి, మెజారిటీకి ఒకటి, రెండు సీట్లు తక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉత్తర ప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మరోసారి యోగీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 268కి స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ 202ను దాటేసింది. దీంతో మరోసారి యోగీ సీఎం పీఠంపై కూర్చొబోతున్నారు. స్వాతంత్రం వచ్చాక యూపీకి ఒక సీఎం పూర్తిస్థాయి పదవి కాలం పూర్తి చేసుకున్నాక.. రెండోసారి ఎన్నిక కావడం ఇదే తొలిసారి కానుంది. ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి