News

ఏప్రిల్ ఒకటి నుండి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు

368views
  • టీటీడీ నిర్ణయం

తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభించి భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్స‌వం, డోలోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌లు నిర్వ‌హిస్తారు. కొవిడ్‌-19 ప‌రిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొన‌సాగుతుంది.

అదేవిధంగా, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే విధానంతోపాటు వ‌ర్చువ‌ల్ విధానం కూడా కొన‌సాగుతుంది. వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదు. వారికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌డంతోపాటు ప్ర‌సాదాలు పంపిణీ చేస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్త‌మాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమ‌తిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి