
-
ఇంటర్నెట్ లేకపోయిన డిజిటల్ చెల్లింపులకు అవకాశం
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ లేని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు జరుపుకొనేందుకు వీలుగా ఈ సేవల్ని డిజిసాథిని తీసుకొచ్చినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
గత మూడేళ్ళుగా డిజిటల్ చెల్లింపులకు ఊతం ఇచ్చేందుకు ఆర్బీఐ విశేషంగా కృషిచేసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలని, ఎలాంటి ప్రతికూలతలు తలెత్తకుండా అన్నింటికీ సిద్ధపడేలా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.డిజిటల్ చెల్లింపుల కోసం ‘డిజిసాథీ’ 24×7 హెల్ప్‌లైన్‌ను కూడా ఆవిష్కరించారు.
యూపీఐ చెల్లింపులు 2016లోనే వచ్చినా ఇది స్మార్ట్ఫోన్లకే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు చాలా వరకు ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి అవసరాల కోసం.. ఆ తరహా మొబైల్స్‌లోనూ యూపీఐ పేమెంట్స్ చేసుకునేందుకు వీలుగా కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





