News

సరిహద్దుల్లో ఇండియా డ్రోన్స్ గస్తీ!

525views

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో మేడిన్ ఇండియా డ్రోన్స్ గస్తీ కాయనున్నాయి. భారత సైన్యం త్వరలో భారత్‌లో తయారు చేసిన మానవ రహిత వైమానిక వాహనం(యు.ఎ.వి)లను నిఘా కోసం ఆపరేట్ చేయనుంది. ముంబైకి చెందిన ఐడియాఫోర్జ్ భారత సైన్యానికి ‘200 స్విచ్ విఎవి’లను డెలివరీ చేసే కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకుంది. వర్టికల్ టేక్-ఆఫ్ ల్యాండింగ్ (వి.టి.ఒ.ఎల్‌) మినీ యుఎవిలు రక్షణ ఒప్పందంలో కంపెనీ కుదుర్చుకుంది. రక్షణ మూలధన సేకరణ బడ్జెట్‌లో దాదాపు 68 శాతం దేశీయ సేకరణకు కేటాయించినట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది.

ఫ్రాన్స్, ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, భారతదేశానికి చెందిన ఇతర సంస్థల నుండి పోటీని ఎదుర్కొన్న తర్వాత భారతీయ కంపెనీ ఈ ఒప్పందంను సొంతం చేసుకుంది. స్విచ్ యు.ఎ.వి భారత సైన్యం నిర్వహించిన కఠినమైన పరీక్షలలో భాగంగా ఫీల్డ్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక వ్యవస్థ అని కంపెనీ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. సరిహద్దుల్లో రక్షణకు ఫిక్స్‌డ్ వింగ్ యు.ఎ.వి అనువైన పరిష్కారం అని భావిస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి