News

పురాత‌న శివాల‌యంపై బంగారు పూత గ‌ల క‌ల‌శాలు చోరీ!

606views

కడలూరు(త‌మిళ‌నాడు): కడల్లూరు జిల్లా, వృదాచలంలోని ప్రసిద్ధ విరుతగిరీశ్వర్ శివాలయంపై ఉన్న బంగారు పూత క‌లిగిన మూడు క‌ల‌శాలు చోరీ అయ్యాయి. ఒక్కో కలశం 300 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది.

దేశంలోని 1008 శివాలయాలలోని నాలుగు అగ్రశ్రేణి శివాలయాల్లో ఒకటిగా ఈ ఆలయం ప్ర‌సిద్ధి చెందింది. మ‌హా శివ‌రాత్రి మంగళవారం ఉదయం ఆలయంపై ఉన్న క‌ల‌శాలు కనిపించకుండా పోయాయ‌ని స్థానికులు, ఆలయ పూజారులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడలూరులోని విరుతగిరీశ్వర్ దేవాలయానికి 2,500 ఏళ్ళ చ‌రిత్ర ఉంద‌ని చెబుతున్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి