
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన షరీఫ్ సోహైల్ అనే వ్యక్తి మరో కమ్యూనిటీకి చెందిన బాలికను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడు. తర్వాత పెళ్ళి చేసుకున్నాడు. అంతేకాదు.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఇప్పుడు వారిద్దిరికి పుట్టిన నెలలు నిండని శిశువు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంది. ఫిబ్రవరి 18న ఇండోర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతను బెయిల్ పొంది, పరారీలో ఉన్నాడు.
సోహైల్ వయస్సు 21 కాగా, వయస్సు 17 ఏళ్ళు. ఆమె ఫిబ్రవరి 17న ప్రసవించిన తర్వాత మొత్తం వ్యవహారం బట్టబయలైంది. సోహైల్ మతం మార్చిన తర్వాత ‘పెళ్లి చేసుకున్నాడు’ అని బాధితురాలు తెలిపింది.
బాల్య వివాహం గురించి తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) చైర్మన్ పల్లవి పోర్వాల్, ఇతర సభ్యులతో కలిసి యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్ వాస్తవానికి సాజన్ నగర్ నివాసి. సోహైల్ ఇల్లు ఇండోర్ నగరంలోని ఆజాద్ నగర్‌లో ఉంది.
Source: HINDU POST





