News

పాకిస్థాన్‌లో భారీ పేలుడు

502views

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. క్వెట్టా నగరంలోని ఫాతిమా జిన్నా రోడ్‌లో పోలీసు వ్యాన్ సమీపంలో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించారు. 24 మంది గాయపడినట్టు స్థానిక మీడియా నివేదించింది. డిఐజి ఫిదా హుస్సేన్ మాట్లాడుతూ 2-2.5 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను ఉపయోగించినట్టు తెలుస్తోందని అన్నారు. మరణించిన వారిలో ఒకరిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి)గా గుర్తించారు. పోలీసు అధికారులతో సహా 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో ఒక ప్రకటనలో ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పిరికిపంద టెర్రరిస్టులు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద దాడికి పాల్పడ్డారని విమర్శించారు. క్వెట్టా, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతోందని బిజెంజో వ్యాఖ్యానించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి