News

రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం.. క్వాడ్​ నేతలతో మోదీ కీలక భేటీ

415views

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా క్వాడ్​ నేతలైన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాలతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా​ సమావేశం కానున్నారు. ఇండో- పసిఫిక్​ ప్రాంతానికి సంబంధించిన కీలక అంశాలపై క్వాడ్​ నేతలు చర్చించనున్నట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. క్వాడ్​ ప్రణాళికలో భాగంగా ఇండో- పసిఫిక్​కు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై నేతలు సమీక్ష నిర్వహిస్తారని తెలిపింది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి