News

ఇప్పటి వరకు 6,000 మందిని తీసుకొచ్చాం..

534views

న్యూఢిల్లీ: రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో మొత్తం 20,000 భారతీయలు చిక్కుకుపోగా వారిలో ఇప్పటి వరకు 6,000 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామ‌ని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. మిగతావారిని కూడా సురక్షితంగా తీసుకురాడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయ‌న‌ బుధవారం చెప్పారు.

‘అక్కడ దాదాపు 20,000 మంది చిక్కుకోగా, వారిలో 4,000 మందిని ఫిబ్రవరి 24 నాటికి తీసుకొచ్చాం… మరో 2000 మంది విద్యార్థులను మంగళవారం వరకు తీసుకొచ్చాం.. ఇంకా చిక్కుకుపోయి ఉన్న వారిని కూడా తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నాం’ అని మురళీధరన్ తెలిపారు.

చిక్కుకుపోయిన వారి సంఖ్య పెద్ద సంఖ్యలో ఉన్నందున వారిని భారత్ తెచ్చేందుకు రక్షణ రంగానికి చెందిన విమానాన్ని ఉపయోగిస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న రొమేనియా, పొలాండ్, హంగరీ, స్లోవేకియా వంటి దేశాల సహకారంతో విద్యార్థులను భారత్‌కు తరలిస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి