
ఉక్రెయిన్ నుండి పలు దేశాల విద్యార్థులు బయట పడడానికి కష్టాలు పడుతూ ఉన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని భారతీయులతో ఆరు విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న విమానంలో 240 మంది భారతీయులు దేశం చేరుకోగా.. ఇప్పటిదాకా ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా భారత్ చేరుకున్న వారి సంఖ్య 1,396కు చేరుకుంది. కేంద్ర మంత్రివర్గంలోని నలుగురు మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరుకుంటున్నారు.
పాకిస్తాన్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ లో ఉన్నారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పాకిస్తానీ విద్యార్థులను పట్టించుకోవడం లేదంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి పాక్ విద్యార్థులు భారత జెండాను ఉపయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. తమ వాహనంపై తమ జాతీయ జెండాను ప్రదర్శిస్తే భారతీయులకు ఎటువంటి హాని జరగదని రష్యన్లు హామీ ఇవ్వడంతో పాక్ విద్యార్థులు ఈ పని చేస్తున్నారు. ట్విట్టర్‌లో విస్తృతంగా ప్రసారం అవుతోంది ఈ వీడియో. పాకిస్తానీ విద్యార్థులు భారత జెండాను ఉపయోగిస్తున్నారని పాకిస్తానీ న్యూస్ యాంకర్ చెప్పారు.
Pakistani student using indian flag to come out of ukraine… Thats power of our india and Modiji… Watch till the end.#indianstudentsinukraine #nuclearwar pic.twitter.com/dBVp4Dj4xe
— Jay (@PoojaraJaydeep) February 28, 2022
పాక్ కు సంబంధించిన వార్తలను ఎక్కువగా నివేదించే ‘హిందుస్థాన్ స్పెషల్’ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ఫిబ్రవరి 27న ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఉక్రెయిన్‌లోని పాకిస్తానీ విద్యార్థులు భారత జెండాను పట్టుకున్నారని వెల్లడించాడు. మరో దేశంలోకి వెళ్లేందుకు, ఉక్రెయిన్ సరిహద్దుకు సురక్షితంగా చేరుకోడానికి ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశారు.





