News

ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్న కేంద్రమంత్రులు…

525views

* విద్యార్థుల తరలింపును మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సాహసోపేత నిర్ణయం

ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలకు పంపించనుంది. ఈ మేరకు నలుగురు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాధిత్య సింథియా, కిరెణ్ రిజిజు, వీకే సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సోమవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోపాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

ఉక్రెయిన్లోని పరిణామాలపై ఆదివారం కూడా ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు ఐదు విమానాల్లో ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించారు అధికారులు. తాజాగా ఐదో విమానంలో 249 మంది విద్యార్థులు భారత్ కు వచ్చారు. ఇంకా దాదాపు 16వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.