
480views
బేలారస్ వేదికగా రష్యా- ఉక్రెయిన్ ల మధ్య జరుగనున్న చర్చలపై ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఇవాళ ప్రిప్యాట్ నదికి సమీపంలో ఉక్రేనియన్ – బెలారసియన్ సరిహద్దు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చల్లో భాగంగా ఉక్రేయిన్ ప్రతినిది బృదం- రష్యన్ ప్రతినిదుల బృదం సమావేశమవుతారు. అయితే షరతులు లేకుండా చర్చలకు సిద్దంగా ఉన్నామని ఉక్రెయిన్ చెబుతుండగా.. మరో వైపు షరతులకు లోబడి చర్చలకు రావాలని రష్యా చెబుతోంది. యూరోపియిన్ యూనియన్ లో చేరవద్దని రష్యా షరతు పెడుతుండగా.. యూరోపియన్ యూనియన్ లో చేర్చోకోవాలని ఉక్రెయిన్ కోరుతోంది. ఇప్పటికే ఇరు దేశాలు చర్చలకు సిద్ధమంటూనే భీకరంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు ఫలిస్తాయా లేదో…. అసలు ఏం జరగబోతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.





