
571views
-
భారత ప్రధాని మోడీని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: మూడు రోజులుగా కొనసాగుతున్న రష్యా దాడులు, ప్రతిఘటనతో ఉక్రెయిన్ అలసిపోతోంది. ఈ తరుణంలో మిలిటరీ చర్యలను ఆపే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ భారత్ సాయం కోరారు.
శనివారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీఫోన్ చేశారు. రష్యా దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని జెలెన్‌స్కీ, ప్రధాని మోదీని కోరారు. వీలైనంత త్వరగా ఈ సంక్షోభం ముగిసేలా చూడాలంటూ ఆయన ప్రధాని మోదీని కోరినట్టు సమాచారం.
అంతేకాదు.. ఈ మేరకు జెలెన్‌స్కీ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. లక్షకు పైగా చొరబాటుదారులు తమ భూభాగంలోకి ప్రవేశించారని, ఐక్యరాజ్య సమతి భద్రతా మండలిలో రాజకీయ మద్దతు ఉక్రెయిన్‌కు ప్రకటించాలని జెలెన్‌స్కీ కోరినట్టు సమాచారం. ప్రతిస్పందన గురించి సమాచారం అందాల్సి ఉంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





