News

సరిహద్దులకు చేరిన భారత విద్యార్థులు

620views

ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న భారత విద్యార్థుల తరలింపునకు రంగం సిద్ధమైంది. పోలాండ్, హంగరీ, రొమేనియా సరిహద్దులకు 470 మందిని తరలించారు. ఆయా దేశాల విమానాశ్రాయాల నుంచి భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంది.

ఉక్రెయిన్‌-పోలాండ్ సరిహద్దుకు ఎనిమిది కి.మీ. దూరంలో కాలేజ్ బస్సు డ్రాప్ చేశాక మంది విద్యార్థులు కాలినడకన సరిహద్దుకు చేరుకున్నారని ఎఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. పోలాండ్‌కు 70 కి.మీ. దూరంలో ఎల్వివ్‌లోని వైద్య కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉక్రె యిన్‌ను వదిలి పొరుగు దేశంలోకి వెళ్లిపోవాలనుకున్నారు.

కానీ రష్యా దాడితో ఉక్రెయిన్ గగన తలం కూడా మూతపడిపోయింది. పోలాండ్ ఉక్రెయిన్ సరిహద్దుకు నడుచుకుంటూ చేరిన వీడియోను కూడా భారతీయ విద్యార్థులు షేర్ చేశారు. ఉక్రెయిన్‌లో దాదాపు 16,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.

రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడిచేయడంతో వారంతా అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎల్వివ్, చెర్నివ్‌ట్సీలో క్యాంప్ ఆఫీసుల తెరిచింది. పోలాండ్‌కు తరలిపోతున్న భారతీయ విద్యార్థులకు సాయపడేందుకు రష్యన్ భాష మాట్లాడే అధి కారులను ఈ క్యాంప్ ఆఫీసులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పంపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి