News

మార్చి 15 నుంచి సాధారణ అంతర్జాతీయ విమానాల రాక‌పోక‌లు

541views

న్యూఢిల్లీ: కరోనాతో దేశంలో 2020 మార్చి 23 నుంచి నిలిచిపోయిన సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. రెండేళ్ల తర్వాత.. మార్చి 15 నుంచి ఇవి మొదలయ్యే అవకాశాలున్నాయ ని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై పౌర విమానయాన శాఖ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కాగా, దేశీయ విమానయానం పుంజుకుంటోందని.. రోజువారీ ప్రయాణికుల సంఖ్య వచ్చే రెండు నెలల్లో కొవిడ్‌ కనిష్ట స్థాయికి చేరుకుంటుందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి