
553views
నల్గొండ: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనలో పైలట్, శిక్షణ పైలట్ మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Source: EtvBharat





