
* సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటి వరకు 4,700 కేసులను విచారిస్తోందని, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) 2002లో అమలులోకి వచ్చినప్పటి నుండి కేవలం 313 మందిని మాత్రమే అరెస్టు చేశారని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలాంటి విషయాల్లో న్యాయస్థానాలు ఎలాంటి బలవంతపు చర్య తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందువల్ల సుమారు రూ. 67,000 కోట్ల రూపాయలు నిలిచిపోయి ఉన్నాయని జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రభుత్వం తెలిపింది.
విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుల్లో న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఈడీ దాదాపు రూ.18,000 కోట్లను జప్తు చేసిందని న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (PMLA) తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,700 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించినట్టు తెలిపింది. అన్ని కేసుల్లో కలిపి మొత్తం రూ.67వేల కోట్లను ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ రోజు వరకూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా 4,700 కేసులు దర్యాప్తు చేయబడుతున్నాయి. గత ఐదేళ్లలో ప్రతి సంవత్సరం విచారణకు తీసుకున్న సగటు కేసుల కేసుల సంఖ్య 2015-16లో 111 కేసుల నుండి 2020-21లో 981కి పెరుగుతూ వచ్చిందని మెహతా ధర్మాసనానికి తెలిపారు. పిఎంఎల్‌ఎ చట్టం అమలులోకి వచ్చిన 2002 నుండి ఇప్పటి వరకు కేవలం 313 అరెస్టులు మాత్రమే జరిగాయని మెహతా ధర్మాసనానికి చెప్పుకొచ్చారు. 2002 నుండి ఇప్పటి వరకు 20 సంవత్సరాలలో 313 అరెస్టులు జరిగాయని ఆయన అన్నారు. డేటాను ప్రస్తావిస్తూ యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, హాంకాంగ్, బెల్జియం రష్యా వంటి దేశాల్లో మనీలాండరింగ్ చట్టం కింద కేసుల వార్షిక నమోదుతో పోలిస్తే PMLA కింద చాలా తక్కువ సంఖ్యలో కేసులను విచారణకు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోందని మెహతా అన్నారు.





