News

మేడారంలో ఘనంగా తిరుగువారం పండుగ

456views

మేడారంలో తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహించారు. జాతర ముగిసిన తర్వాత వచ్చే బుధవారం రోజున తిరుగువారం పండుగ అంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా జాతర విజయవంతంగా జరిగినందుకు…..వనదేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ….ఆలయాలను శుద్ధి చేసి, గద్దెల చెంత పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పసుపు కుంకుమలు సమర్పించి…బంగారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందులో పూజారులు కుటుంబ సమేతంగా పాల్గొంటారు. దీనితో మహా జాతర వేడుకలు…పూర్తయినట్లే. తిరగువారం పండుగ రోజున కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ పూజారులు జాతర సమయంలో తలనీలాలు ఇవ్వకుండా తిరుగువారం నాడు పూజారులంతా పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. గిరిజన వాయిద్యాలతో సమ్మక్క సారలమ్మ పూజారులు గుడి వద్దకు వెళ్లి పూజలు చేసి మేకలు, కోళ్లను బలి ఇచ్చారు. సంప్రదాయ పద్ధతిలో తిరుగువారం పండుగ ఘనంగా జరుపుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.