News

ఉక్రెయిన్ – రష్యా వార్ విషయంలో భారత్ తటస్థ వైఖరి

606views

* భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ వెల్లడి

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడం యావత్ ప్రపంచానికీ ఆందోళన కలిగించే అంశమని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ అన్నారు. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని, శాంతిని నెలకొల్పాలని కోరారు. ఈ క్రైసిస్ విషయంలో భారత్ తటస్థ వైఖరిని ఎంచుకుందని, ఏ దేశం వైపూ మొగ్గు చూపబోదని స్పష్టం చేశారు. ఆ రెండు దేశాలు శాంతియుత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.