News

మరో లడ్డూ కావాలా నాయనా?

590views

* ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం మరో తీపి కబురు.. జీతంతో అదనంగా రూ.30 వేలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ అడ్వాన్స్ కింద రూ. 10,000ల చొప్పున అకౌంట్ లో వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం…. ఉద్యోగులకు మరో తీపి కబురు అందించింది. ఉన్నత డిగ్రీ పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని 5 రెట్లు పెంచేసింది. ఉద్యోగ కాలంలో పీహెచ్‌డీ వంటి ఉన్నత డిగ్రీలు పొందే/పొందిన ఉద్యోగులకు ప్రోత్సాహక మొత్తాన్ని రూ.10,000 నుంచి ఒకేసారి రూ.30,000కు పెంచారు.

ఉన్నత డిగ్రీలు చదివే ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 20 ఏళ్ల నిబంధనలను సవరించింది. పాత నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు ఉద్యోగ సమయంలో ఉన్నత డిగ్రీలు సాధించిన ఉద్యోగులకు ఏక మొత్తంలో రూ. 2000 నుంచి రూ.10,000 వరకు ప్రోత్సాహకం ఇచ్చేవారు. కానీ సవరణ తర్వాత ఈ ప్రోత్సాహక కనీస మొత్తాన్ని రూ.2000 నుండి రూ.10,000కి పెంచారు. అంటే ఇప్పుడు ఉద్యోగులు ఉన్నత డిగ్రీని సాధించినప్పుడు ఎక్కువ ప్రోత్సాహక భత్యం పొందుతారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం 3 సంవత్సరాలు లేదా అంత కన్నా తక్కువ కాలంలో డిప్లొమా కోర్సులు చేస్తే రూ.10,000, 3 సంవత్సరాల కన్నా ఎక్కువ కాల పరిమితిలోని డిగ్రీ లేదా డిప్లొమా చేస్తే రూ. 15000 ప్రోత్సాహకంగా ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా చేయడానికి 1 సంవత్సరం లేదా అంత కన్నా తక్కువ రూ. 20,000 చెల్లిస్తారు.

అదే సమయంలో ఒక సంవత్సరం కన్నా ఎక్కువ వ్యవధి ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా తీసుకున్న ఉద్యోగులకు రూ. 25,000 చెల్లిస్తారు. పీహెచ్‌డీ విద్యార్హత పూర్తి చేసిన వారికి రూ. 30,000 ప్రోత్సాహకం అందజేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగి పొందిన డిగ్రీ/ డిప్లొమా ఉద్యోగి పోస్ట్ ‌కి సంబంధించి ఉండాలి లేదా ఈ డిగ్రీ అతని తదుపరి పోస్ట్ ‌లో చేయబోయే పనికి సంబంధించి ఉండాలి. అకడమిక్ విద్య లేదా సాహిత్య విషయాలలో ఉన్నత విద్యార్హతలను పొందేందుకు/పొందినందుకు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వరు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.