News

ఉక్రెయిన్ పై రష్యా దాడులు : ఐరాసలో ఆందోళన వ్యక్తం చేసిన భారత్

310views

ష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ‌లో ఏర్పడిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ‌లో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)కి భారత దేశ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తెలిపారు.

విద్యార్థులు, ఇతర భారతీయులను తిరిగి భారత దేశానికి తీసుకెళ్ళేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని UNSCకి చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని భారత్ కోరుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితిని సరైన రీతిలో, జాగ్రత్తగా పరిష్కరించకపోతే, భారీ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందన్నారు. భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని తెలిపారు. అన్ని వర్గాల భద్రతను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.