
గాంధీనగర్: భరూచ్‌లోని స్థానిక కోర్టు, భరూచ్ సామూహిక మత మార్పిడి కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ దరఖాస్తును సోమవారం తిరస్కరించింది. నిందితుల్లో ముగ్గురు.. ఇబ్రహీం పునా పటేల్ అలియాస్ జితుభాయ్ పునాభాయ్ వాసవ, అయ్యూబ్ బర్కత్ పటేల్ అలియాస్ రమణ్‌భాయ్ బర్కత్‌భాయ్ వాసవ, యూసుఫ్ జీవన్ పటేల్ అలియాస్ మహేంద్రభాయ్ జీవన్ పటేల్ ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టును ఆశ్రయించి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
భరూచ్ సామూహిక మార్పిడి కేసు
గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని అమోద్ తాలూకాలోని కంకరియా గ్రామానికి చెందిన ప్రవీణ్ వాసవ అనే వ్యక్తి ఫిర్యాదుపై ఫెఫ్దావాలా హాజీ అబ్దుల్లా, సలావుద్దీన్ షేక్, మరికొందరిపై నవంబర్ 2021లో వాసవ కమ్యూనిటీ (షెడ్యూల్డ్ తెగ) వ్యక్తులను మత మార్పిడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఉద్యోగం, ఇల్లు, పెళ్లి కోసం కాబోయే వధువు వంటి ఆర్థిక లాభాలతో వారిని ప్రలోభపెట్టి ఇస్లాం మతంలోకి తీసుకెళ్లారు. మత మార్పిడి కార్యకలాపాలకు సహకరించినందుకు విదేశాల నుంచి వచ్చిన నిధులను భారత్‌కు ఎలా తరలించారో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
జూన్-జూలై 2021లో ఛేదించిన ఉత్తరప్రదేశ్ సామూహిక మత మార్పిడి రాకెట్‌తో ఈ సామ్రాజ్యానికి కూడా లింకు ఉంది. ఇక్కడ ఉమర్ గౌతమ్‌తో పాటు సలావుద్దీన్ షేక్ కూడా ప్రధాన నిందితులలో ఒకరు. షేక్ ఎన్‌జీవో ఏ.ఎఫ్.ఎం.ఐ ద్వారా, ఫెఫ్దావాలా, ఇతరులు నిధులు మళ్లించారని, వీటిని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. దీంతో డిసెంబర్, 2021లో, హోం మంత్రిత్వ శాఖ ఆ ఎన్‌జీవో ఎఫ్.సీ.ఆర్.ఏ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. షేక్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉండగా, ఫెఫ్దావాలా పరారీలో ఉన్నాడు.
Source: OpIndia





